ప్ర‌జ‌ల అవ‌స‌రాన్ని రేషన్ కార్డుల ప్ర‌క్రియ నిరంత‌రం కొన‌సాగుతుంది – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

ప్ర‌జ‌ల అవ‌స‌రాన్ని రేషన్ కార్డుల ప్ర‌క్రియ నిరంత‌రం కొన‌సాగుతుంది

– మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

హైదరాబాద్, ఆగ‌స్టు 02, అద్దం న్యూస్ :    రేషన్ కార్డులు ప్రక్రియ అవసరాన్ని బట్టి నిరంతరం కొనసాగుతుంది.. కొత్తగా పెళ్లి అయిన.. కొత్తగా పుట్టిన వారికి రేషన్ కార్డులు అందిస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ ముషీరాబాద్, అంబ‌ర్‌పేట‌, సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌బ్దిదారుల‌కు నూత‌నంగా మంజూరైన రేష‌న్ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ముషీరాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హాజ‌రై జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాద‌వ్‌, ప‌లువురు కార్పొరేట‌ర్ల‌తో క‌లిసి ల‌బ్దిదారుల‌కు రేష‌న్ కార్డుల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ… ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ప్రజా పాలన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామ‌న్నారు. గత 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్లి అయిన కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారికి రేషన్ కార్డులు రాలేవన్నారు. హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల్లో 55 వేల రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. ఇంకా లక్షా రేషన్ కార్డులు వెరిఫికేషన్ నడుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మొన్నటి వరకు ఆషాఢ మాసం బోనాలు పండగ జరిగింది..ఇప్పుడు శ్రావణ మాసంలో రేషన్ కార్డుల పండగ జరుగుతుందన్నారు. రేషన్ కార్డు కు సంబంధించి గతంలో దొడ్డు బియ్యం ఇచ్చే పరిస్థితుల్లో ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం అందిస్తున్నామ‌ని పొన్నం స్ప‌ష్టం చేశారు. పెద్దలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యం ప్రతి పేదవాడు తినేలా సన్న బియ్యం ఇస్తున్నాం.. మీలో మార్పు కనిపించాలన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామ‌న్నారు. మహిళలు ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న వడ్ల కి 500 బోనస్, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం, హాస్టల్ లలో మెస్ చార్జీలు పెంచిన ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల‌ని మంత్రి కోరారు. ఇటీవల 200 కోట్ల మంది మహిళలకు ఆర్టిసీలో ఉచితంగా ప్రయాణం చేశార‌ని.. 6800 కోట్లు విలువైన ఉచిత ప్రయాణం చేశారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలుకు ప్రత్యేక పథకాలు , సున్నా వడ్డీకి రుణాలు అందిస్తున్నామ‌న్నారు. హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ లు, రోడ్లు, డ్రైనేజీ లు అన్ని నిర్మిస్తున్నామ‌న్నారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్డులో లని చేసే వారికి కొల్లూరు ఇల్లు నిర్మించింద‌న్నారు. పనిచేసే చోటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం..ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామ‌న్నారు. ప్రభుత్వం తరుపున అందాల్సిన ఏ కార్యక్రమైన కొనసాగిస్తున్నాం. .ఒకటో తారీకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామ‌ని తెలిపారు. అర్హతను బట్టి రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌డివో, డిఎసిఎస్ఓ శ్రీనివాస్‌, ఏసిఎస్ఓ దీప్తి, ముషీరాబాద్‌, హిమాయ‌త్‌న‌గ‌ర్ త‌హ‌శిళ్థార్లు రాణా ప్ర‌తాప్‌సింగ్‌, ఇతర ముఖ్య నేతలు, రేష‌న్ డీల‌ర్లు, అధికారులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page