జీవో నెంబర్ 343 అమలుపరుస్తూ చెరువులలో చేపలు పట్టుకునే హక్కును కల్పించాలి

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : జీవో నెంబర్ 343 అమలుపరుస్తూ చెరువులలో చేపలు పట్టుకునే హక్కును కల్పించాలని రజక ఫిషర్‌మెన్‌ రాష్ట్ర సొసైటీల కమిటీ వ్యవస్థాపక చైర్మన్ ఆమనగంటి సైదులు అన్నారు. ఈ నెల 15వ తేదీన బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య‌విజ్ఞాన‌కేంద్రంలో జరుగు రజకుల జన శంఖారావం ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ చేతుల మీదగా గోడ పత్రికనావిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చదువుకొని కాలిగున్న విద్యార్థిని విద్యార్థులకు స్వయం ఉపాధి భరోసా కనిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. జీవో నెంబర్ 343 అమలుపరుస్తూ చెరువులలో చేపలు పట్టుకునే హక్కును కల్పిస్తేనే ర‌జ‌కుల జీవితాలు బాగుప‌డుతాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి నేర్నాకంటి రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దూదు గాని చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి చాకలి రామస్వామి, రాష్ట్ర కోశాధికారి నేరెళ్ల కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల యాదయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె.దుర్గా, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన మంగ, లక్ష్మి, పి.వెంకన్న, పూస పెళ్లి శ్రీనివాస్, హుస్సేన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page