ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అత్యంత కీలకం
– రాష్ట్ర డిజిపి సివి.ఆనంద్
హైదరాబాద్, మే 14, ( అద్దం న్యూస్ ) : ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అత్యంత కీలకం అని తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి.ఆనంద్ అన్నారు. తెలంగాణ డీజీపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన మీడియా డైరీని సివి.ఆనంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి ఆనంద్ మాట్లాడుతూ… ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన సంస్థల్లో మీడియా ఒకటని, జర్నలిస్టులు సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రాజకీయ, ఆర్థిక, విద్య, వైద్య, సాంకేతిక రంగాల అభివృద్ధిపై మీడియా మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రజల మధ్య జర్నలిస్టులు వారధిగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి సీనియర్ పాత్రికేయులు చిలుకూరు అఖిలేష్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభంగా భావించే జర్నలిజం వృత్తికి అంకితభావంతో సేవలందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పగుడాకుల బాలా స్వామి, ప్రధాన కార్యదర్శి జూలురు రమేష్, ఉపాధ్యక్షుడు లక్కాకుల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply