ఢిల్లీలో ‘పెద్ది’ షూటింగ్ సందడి..

ఢిల్లీలో ‘పెద్ది’ షూటింగ్ సందడి..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటోంది. అరుణ్ జైట్లీ స్టేడియం, తెలంగాణ భవన్, ఇండియా గేట్ వంటి కీలక ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా రామ్ చరణ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీని సందర్శించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాటకు భారీ స్పందన రావడంతో ‘పెద్ది’పై హైప్ మరింత పెరిగింది.

మార్చి 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, యూనిట్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రీకరణ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతుండటం విశేషం. ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం రాజధానిలో భారీ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఏపీ భవన్, పార్లమెంట్ పరిసరాలు, ఇండియా గేట్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, రాష్ట్రపతి భవన్, జామా మసీదు, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాల్లోనూ షూటింగ్ జరగడంతో ఈ షెడ్యూల్‌పై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా తెలంగాణ భవన్‌లో కూడా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మంగళవారం సాయంత్రం అక్కడి క్యాంటీన్‌లో జరిగిన షూటింగ్ సందర్భంగా రామ్ చరణ్ సందడి చేయడం అభిమానులను ఉత్సాహపరిచింది. ఈ షూటింగ్ షెడ్యూల్‌లో భాగంగా రామ్ చరణ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి తెలంగాణ భవన్‌కు చేరుకోగా ఆయన్ని చూడాలనే ఉత్సాహంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page