తెలంగాణ‌లో మ‌ళ్లీ టిడిపి అధికారంలోకి రావ‌డం ఖాయం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్‌

తెలంగాణ‌లో మ‌ళ్లీ టిడిపి అధికారంలోకి రావ‌డం ఖాయం
– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్‌

హైదరాబాద్, మార్చి 29, అద్దం న్యూస్ :  తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావ‌డం ఖాయమ‌ని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైద‌రాబాద్‌ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నాయకుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆశ‌యాలు కొన‌సాగాల‌ని, చంద్రబాబు టీడీపీ పరిపాలన ఎప్పటికీ ఉండాలని కోరుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు పులిహోర ప్యాకెట్లను అందజేశారు. అలాగే అశోక్‌న‌గ‌ర్ ప్ర‌ధాన రోడ్డు మార్గంలో ఉన్న ఎన్‌టిఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

ఈ సందర్భంగా బాలరాజు గౌడ్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దివంగత ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌ కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలంగాణలో పటేల్, పట్వారి పరిపాలన తీసివేసి ప్రజారాజ్యం తీసుకువచ్చిన ఘనత ఎన్‌టిఆర్ ది అన్నారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన‌ మహాపురుషుడు ఎన్‌టిఆర్ అని కొనియాడారు. అదే బాటలో ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజల దగ్గర పరిపాలన తీసుకువచ్చారన్నారు. హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీగా మార్చి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. తెలంగాణ గడ్డపైన మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన భీమా నష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చంద్రమోహన్ గౌడ్, శంకర్, ఎస్‌వి.నాయుడు, ఉదయ్ కుమార్, శివ కృష్ణ‌, అన్నపూర్ణ, వీణ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page