బిసిలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీయే
– టిడిపి రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 14, అద్దం న్యూస్ : బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాలు కల్పించి చైతన్య పరిచింది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ జిల్లా టిడిపి పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… ఈనెల 18వ తేది బిసి సంఘాల ఐక్య వేదిక జేఏసి నిర్వహించ తలపెట్టిన బంద్ కార్యక్రమానికి టిడిపి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. తెలుగుదేశం ప్రధాన లక్ష్యం బలహీన వర్గాల సంక్షేమమేనని, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలను చైతన్యపరిచి రాజ్యాధికారం కలిపించే దిశగా కృషి చేస్తూనే ఉంటుందన్నారు. నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి నిరూపించుకోవాలని అన్నారు.
బీసీలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశానికే వెన్నుముక లాంటి బీసీలను గుర్తించిందన్నారు. బలహీనవర్గాల ప్రజలకు సమాజంలో సమున్నతమైన స్థానం కల్పించి, వారి అభివృద్ధికి కృషి చేసింది, రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు సాయిబాబా, ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల, కిషోర్, బాలరాజ్ గౌడ్, నాయకులు ఎస్ ప్రకాష్, శుక్రవేది, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply