Sunday, September 20, 2026
No menu items!
HomeHyderabad25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వము అన్న నిర్ణయాన్ని ట్రస్మా వెనక్కి తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ...

25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వము అన్న నిర్ణయాన్ని ట్రస్మా వెనక్కి తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అశోక్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, మే 20, అద్దం న్యూస్ :    తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వా అనుమతి పొందిన ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ మేనేజ్‌మెంట్స్‌ ( ట్రస్మా ) ప్రైవేటు స్కూళ్లల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయము అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అశోక్‌రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు స్కూల్స్‌లో అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ అమలు చేయము అన్న నిర్ణయాన్ని వెంటనే ట్రస్మా వెనక్కి తీసుకోవాలి. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూల్స్లో విద్యా హక్కు చట్టం అమలు అయ్యేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. ప్రభుత్వము బకాయిలు ఇవ్వడం లేదని ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సరైనది కాదన్నారు. ప్రైవేటు స్కూల్స్‌లో ఇష్టానుసారంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్‌లో ఫీజులు ఉన్నాయన్నారు. ఫీజుల రూపంలో కాకుండా బుక్స్ యూనిఫామ్స్ పేరుతో కూడా పెద్ద ఎత్తున దందా చేస్తున్నార‌న్నారు. ప్రభుత్వం ఫీజులు నిర్ణయించక ముందే వాళ్ళ ఇష్టానుసారంగా 10 నుండి 30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం విద్యా హక్కు చట్టము ప్రైవేటు స్కూల్స్‌ల్లో అమలయ్యే విధంగా చూడాలన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page