...

దేవునితోట భ‌వాని శంక‌ర దేవాల‌యంలో ఉగాది పంచాగ‌ శ్ర‌వ‌ణం

హైదరాబాద్, అద్దం న్యూస్ :   శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో వాడ వాడ‌లా ఉగాది వేడుక‌లు జ‌రిగాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోట శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో ఆదివారం ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అర్చ‌కులు మురళీధర శర్మ, రామకృష్ణ శాస్త్రీ, అరవింద్ కుమార్ త‌దిత‌రులు పంచాంగాన్ని వినిపించారు. రాశిఫలాలు, పండుగలు, శుభ ముహూర్తాలు, గ్రహస్థితి, వర్ష సూచనలు, ఇతర ముఖ్యమైన విషయాలను తెలియచేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య సిబ్బంది మిక్కిలినేని సురేష్, భ‌క్తులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.