తైక్వాండోలో 12 వ సారి
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సాధించిన కొండా సహదేవ్
– కొండా సహదేవ్‌ను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 
హైదరాబాద్, మే 19, అద్దం న్యూస్ : అంతర్జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీల్లో పాల్గొని భారత దేశానికి బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించిన హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కొండా సహదేవ్ మరో రికార్డును సాధించారు. హైదరాబాద్ జెఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఇండియా కెబిఆర్ ఇండోర్ స్టేడియంలో కోచ్ ఎం.జయంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన తైక్వాండో అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి చెందిన పలు రాష్ట్రాల నుంచి పది మంది తైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రపంచంలోని వందకు పైగా దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో భారతదేశానికి చెందిన పది మంది క్రీడాకారులు ఒక గంటలోపు 56 వేల 400 కిక్‌లు కొట్టి రికార్డును సాధించారు. భారతదేశానికి చెందిన పది మందిలో తెలంగాణకు చెందిన కొండా సహదేవ్‌కు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కింది. ఇప్పటికే 11 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను సాధించిన కొండా సహదేవ్ ప్రస్తుతం 12 వ సారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సాధించారు. ఈ మేరకు 12 వ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను సోమవారం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి చేతుల మీదుగా కొండా సహదేవ్ అందుకున్నారు. ఈ సందర్భంగా కొండా సహదేవ్‌కు శాలువా కప్పిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందించారు. ప్రపంచస్థాయిలో తైక్వాండోలో మరింత ఖ్యాతి పొంది భారతదేశ గౌరవాన్ని పెంచాలని సహదేవ్‌కు కిషన్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… తైక్వాండో పోటీల్లో కొండా సహదేవ్ 12 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు కొండా సహదేవ్ అని అన్నారు. ఇలాంటి క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ బిజెపి ప్రధాన కార్యదర్శి వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply