బిజెపి బ‌లోపేతం కోసం కృషి చేయాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌

బిజెపి బ‌లోపేతం కోసం కృషి చేయాలి
– రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 5, ( అద్దం న్యూస్ ) :   బిజెపి బ‌లోపేతం కోసం కృషి చేయాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. గ‌డ్డం న‌వీన్ ను మ‌హంకాళి సికింద్రాబాద్ జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా అధ్య‌క్షునిగా నియ‌మిస్తూ ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ… బిజెపి సిద్దాంతం, ఆద‌ర్శాల‌కు అంకిత‌మై నీతి, నిజాయితీ, నిబ‌ద్ద‌త, క్ర‌మ‌శిక్ష‌ణ చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను గుర్తించి ఉద్య‌మాలు చేప‌ట్టాల‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల‌లో పార్టీని మ‌రింత విస్త‌రించ‌డానికి కృషి చేయాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హంకాళి సికింద్రాబాద్ జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్ మాట్లాడుతూ… ఎస్సీ మోర్చా మ‌హంకాళి జిల్లా పూర్తి స్థాయి క‌మిటీని ప్ర‌కటించామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు భ‌ర‌త్ గౌడ్‌, నాయ‌కులు మేక‌ల సారంగ‌పాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page