సౌమ్యశ్రీ ని అభినందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

సౌమ్యశ్రీ ని అభినందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఎల్‌బినగర్, మే 12, అద్దం న్యూస్ : సీబీఐ లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైన ఆర్య వైశ్య ముద్దుబిడ్డ మిర్యాలగూడకు చెందిన ఆర్య వైశ్య సామాజికవర్గం సన్నిధి కోటయ్య, సునీత ల కుమార్తె సౌమ్య శ్రీ కు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ( ఐవిఎఫ్ ) ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ… తెలంగాణ లో తొలిసారిగా సిబిఐ అధికారిగా ఎంపిక కావడం యావత్ ఆర్య వైశ్యులకు గర్వకారణం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సౌమ్య శ్రీ కి ఉప్పల శుభాకాంక్షలు తెలిపారు. మంచి అధికారిగా పేరు తెచ్చుకొని మునుముందు ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మాయిలు అందరూ సౌమ్య శ్రీ ని ఆదర్శంగా తీసుకోవాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, ఐవిఎఫ్ మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి మంజుల, నలిని, తులసి, స్వాతి, ప్రవీణ్, రాజు, వర్ధన్‌తో పాటు సౌమ్యశ్రీ తల్లిదండ్రులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply