యోనెక్స్‌–స‌న్‌రైజ్ 11వ తెలంగాణ స్టేట్ సీనియ‌ర్ బ్యాడ్మింటన్ ఛాంపియ‌న్‌షిప్‌–2025 ముగింపు వేడుక‌ల్లో పాల్గొన్న ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ :    బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి, కోచ్ హర్ష నేతృత్వంలో జరిగిన విశ్వవర్మ బ్యాడ్మింటన్ అకాడమీ మ‌ల్టీప‌ర‌ప‌స్ ఇండోర్ స్టేడియం రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ ( ఆర్ఆర్‌సి ) లో యోనెక్స్‌–స‌న్‌రైజ్ 11వ తెలంగాణ స్టేట్ సీనియ‌ర్ బ్యాడ్మింటన్ ఛాంపియ‌న్‌షిప్‌–2025 ముగింపు కార్య‌క్ర‌మం శ‌నివారం జ‌రిగింది. ఈ వేడుక‌ల‌కు అడిష‌న‌ల్ డిసిపి, బాట్ ఉపాధ్య‌క్షుడు వెంక‌ట్‌రావు, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ అద్య‌క్షుడు, టిపిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త‌లు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఎక్స్ డి విభాగంలో సాయి రామన్, ఏ+లో ఎల్లోరా కోనేర్ అభిన‌య్, సాయి రామ్ గంట‌, సాయి శ్రావ్య త‌దిత‌రులు విజేత‌లుగా నిలిచారు. ఉమెన్స్ విభాగాల్లో అలీష ఖాన్‌, వైష్ణ‌వి, అభిలాష‌, కీర్తి విజేతలుగా నిలిచిన క్రీడాకారుల‌కు బ‌హుమ‌తుల‌ను ప్ర‌దానం చేశారు. మెన్స్ డబుల్ విభాగంలో పులపతి జయన్ష్ రెడ్డి, సాయి రామన్, అమన్, అనీష్‌, వర్షిత్ రెడ్డి, విఘ్నేష్, అనిరుద్, శ్రీవర్ధన్ గౌడ్ త‌దిత‌రులు వారు విజేతలుగా నిలిచారు. ఉమెన్స్ సింగిల్ విభాగంలో శ్రేష్ఠ రెడ్డి, వెన్నాల, మేఘన రెడ్డి తదితరులు విజేతలుగా నిలిచారు. మెన్స్ సింగిల్ విభాగంలో రోహన్ కుమార్, ఋషేంద్ర, తిరుపతి, కూర అనికేత్ రెడ్డి, అఖిల్ రావు తదితరులు విజేతలుగా నిలిచారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాట్ అధ్య‌క్షుడు, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన అన్నారు. పుల్లెల గోపిచంద్ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్‌డిబిఎ అండ్ టిఓసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీనివాస్ రావు, ఐఆర్‌టిఎస్ డాక్ట‌ర్‌.చిమిష‌ఫ‌ర్‌, మాజీ కార్య‌ద‌ర్శి పిసిఎస్‌.రావు, నాగార్జున‌, వంశీ, ఈసి సభ్యుడు చుక్క వేణుగోపాల్‌, 11వ తెలంగాణ స్టేట్ సీనియ‌ర్ బ్యాడ్మింటన్ ఛాంపియ‌న్‌షిప్ జిహెచ్‌.ర‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page