Sunday, September 20, 2026
No menu items!
Homecinemaపవన్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..

పవన్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోందని దర్శకుడు అధికారికంగా వెల్లడించారు. సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ పనితీరును ప్రశంసిస్తూ హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్–హరీశ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన ‘దేఖ్‌లేంగే సాలా’ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్‌ను దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ బోస్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన హరీశ్ శంకర్ మెరుపు వేగంతో పనిచేసే అయనంక బోస్ లేకపోతే ఈ షెడ్యూల్ సాధ్యం అయ్యేది కాదని ప్రశంసలు కురిపించారు. లైటింగ్ విషయంలో ఆయన చూపించిన కమిట్‌మెంట్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. షెడ్యూల్ ఎప్పటి వరకూ కొనసాగుతుందనే వివరాలు వెల్లడించకపోయినా ఇది చివరి షెడ్యూల్ అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు విడుదల తేదీపై ఆశలు పెంచుకుంటున్నారు.

మొత్తం మీద ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చివరి షెడ్యూల్ అప్‌డేట్, ‘దేఖ్‌లేంగే సాలా’ పాటకు వచ్చిన అద్భుత స్పందనతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాతో పవర్ స్టార్ మరోసారి మాస్ రికార్డులు సృష్టిస్తాడనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తోంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page