అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విన‌య్ కుమార్

అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విన‌య్ కుమార్

ముషీరాబాద్, సెప్టెంబ‌ర్ 03, అద్దం న్యూస్ :   వినాయ‌క న‌వ‌రాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో గ‌జానంద్ భ‌క్త స‌మాజ్‌, సిద్ధి వినాయ‌క యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో చిక్క‌డ‌ప‌ల్లిలో ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పాల వ‌ద్ద అన్న‌దాన కార్య‌క్ర‌మాలు బుధ‌వారం జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబర్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌రై గజానందుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఆన్న ప్రసాదాన్ని అందచేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అద్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్ రావు, పి నర్సింగ్ రావు, గజనంద్ భక్త సమాజ్ సభ్యులు శేఖర్, సుజ్జు, గీతు, రామ్ గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page