Virat Kohli: కోహ్లి అభిమానులకు బ్యాడ్‌న్యూస్..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో విరాట్ కోహ్లి (Virat Kohli) మూడో మ్యాచ్ ఆడతాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. న్యూజిలాండ్‌తో సిరీస్ సన్నాహకాల నేపథ్యంలో కోహ్లి రైల్వేస్‌తో జరగనున్న మ్యాచ్‌కు దూరమైనట్లు ఢిల్లీ జట్టు కోచ్ వెల్లడించాడు. ఇప్పటికే ఈ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి (Virat Kohli) అద్భుత ప్రదర్శన చేశాడు. ఆంధ్రతో జరిగిన మొదటి మ్యాచ్‌లో అజేయ సెంటరీ (131) చేశాడు. అనంతరం గుజరాత్లో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేశాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన షరతు వల్ల ఈసారి విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) కళ సంతరించుకుంది. టీమిండియా స్టార్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్ , కేఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు జనవరిలో తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. దీంతో కోహ్లిని మరోసారి డొమెస్టిక్‌లో చూడచ్చని ఆశ పడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. మ్యాచ్‌కు విరాట్ కోహ్లి దూరమైనట్లు తెలుస్తోంది.
కాగా, ముందస్తు షెడ్యూల్ ప్రకారం విరాట్ కోహ్లి రైల్వేస్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇదే విషయం చెప్పింది. కానీ విజయ్ హజారే ట్రోఫీ ఐదో రౌండ్ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ కోచ్ సరన్ దీప్ సింగ్ వెల్లడించారు. త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌కు సన్నాహకంగానే అతను విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ఆడాలనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో ‘కింగ్’ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply