గాంధీన‌గ‌ర్ ను ఆద‌ర్శ డివిజ‌న్‌గా తీర్చిదిద్దే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

గాంధీన‌గ‌ర్ ను ఆద‌ర్శ డివిజ‌న్‌గా తీర్చిదిద్దే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం
– కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 4, అద్దం న్యూస్ :     గాంధీన‌గ‌ర్‌ను ఆద‌ర్శ డివిజ‌న్‌గా తీర్చిదిద్దే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని చిక్కడపల్లిలోని వివేక్‌న‌గ‌ర్, పార్ధివాడ త‌దిత‌ర‌ బస్తీల్లో గురువారం జిహెచ్ఎంసి, వాట‌ర్‌వ‌ర్క్స్ అధికారుల‌తో క‌లిసి స్థానిక గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. స్థానిక బస్తీ వాసులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివేక్‌న‌గ‌ర్ బస్తీ, పార్దివాడ బస్తిలోని మహిళలు స్థానికుల విజ్ఞప్తి మేరకు నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులను త్వరలో ప్రారంభిస్తామని కార్పొరేట‌ర్ పావ‌ని తెలిపారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచే క్రమబద్ధీకరణ పనులను కూడా వెంటనే చేపట్టేందుకు వాటర్ వర్క్స్ అధికారులకు ఆమె ఆదేశించారు. ఈ పర్యటనలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్‌ మహేష్, వాటర్ వర్క్స్ ఏరియా ఇన్‌స్పెక్ట‌ర్‌ శంకర్, వారి సిబ్బంది, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు దామోదర్, శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, మహమూద్, సురేష్ రాజు, సత్యేంద‌ర్‌, నీరజ్, జ్ఞానేశ్వర్, బస్తీ నాయకులు చెనయ్య, రాజు, సురేష్‌బాబు, వెంకటేష్, నాని, సాయి, అరుణమ్మ, సత్యమ్మ, వసంత, కమలమ్మ, లావణ్య, స్థానికులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page