రాబోయే గ్రేట‌ర్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌

రాబోయే గ్రేట‌ర్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటాలి

– రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌

 

ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

హైదరాబాద్, మే 6, అద్దం న్యూస్ :  రాబోయే గ్రేట‌ర్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటాలని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పరిశీలకుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సిద్దేశ్వర్ లు అన్నారు. మంగ‌ళ‌వారం ముషీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జ‌రిగింది. ముషీరాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో జ‌రిగిన ఈ స‌మావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌,సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పరిశీలకుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సిద్దేశ్వర్ లు హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌న్నారు. నాయకులు, కార్యకర్తలతో సమన్వయం పెంచుకొని, పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు ప్రజల్లో ఆదరణ తగ్గిందని… కాంగ్రెస్ పార్టీకి ఆదరణ మరింత పెరిగిందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక కాంగ్రెస్‌ లీడర్ తయారు కావాలని, జనంలో ఉన్న వాళ్లకే రాబోయే రోజుల్లో పదవులను ఇవ్వడం జరుగుతుందన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీల‌తో గెలిపించాలన్నారు. ఈ స‌మావేశంలో పార్టీ ఎ, బి బ్లాక్‌ల అధ్య‌క్షులు విడి.కృష్ణ‌, అంజియాద‌వ్‌, మాజీ కార్పొరేట‌ర్లు క‌ల్ప‌న‌యాద‌వ్, వాజిద్ హుస్సేన్, యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్‌, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంన‌గ‌ర్, ముషీరాబాద్‌, గాంధీన‌గ‌ర్‌, డివిజ‌న్ల అధ్య‌క్షులు జొహేర్ హుస్సేన్‌, పెండెం శ్రీనివాస్ యాద‌వ్‌, అభిషేక్ ల‌తో పాటు పార్టీ నాయ‌కులు మారిశెట్టి న‌ర్సింగ్‌రావు, శీలం స‌త్య‌నారాయ‌ణ‌, లింగం గుప్త‌, బంటారం యాద‌గిరి గౌడ్‌, అతిన‌గ‌రం సుదేష్ నేత‌, జ‌గ‌దీష్‌, సాల్మోన్‌, గుర్రం శంక‌ర్‌, చంద్ర‌క‌ళ‌, లోకేష్ యాద‌వ్‌, పీట‌ర్‌, శ్రీధ‌ర్‌, కృష్ణాగౌడ్, కెఆర్‌కె.ప్ర‌సాద్‌, ర‌మేష్ గౌడ్, రాజ్‌దీప్‌, ర‌ఘు, నియాజ్‌, అల్లావుద్దీన్‌, గోవింద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజ‌రైన ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

              ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజ‌రైన ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page