హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ : అంగన్‌వాడి కేంద్రం, బస్తీ దవాఖానాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం – అడిక్‌మెట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు పాశం సాయికృష్ణ యాదవ్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, బిజెపి మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్ సూచనల మేరకు అడిక్‌మెట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు పాశం సాయికృష్ణ యాదవ్ మంగళవారం వడ్డెర బస్తీలోని అంగన్‌వాడి కేంద్రం, బస్తీ దవాఖానా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ రెండు కేంద్రంలోని పరిసరాలను పరిశీలించారు. చెత్త కుప్పలను తొలగించాలని అధికారులను కోరారు. అంగన్‌వాడి, బస్తీ దవాఖానాలో నీటి సమస్యలతో పాటు విద్యుత్ వైరింగ్ సమస్యలు ప్రధానంగా ఉన్నాయని అక్కడి అధికారులు చెప్పారని సాయికృష్ణ తెలిపారు. సమస్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రొయ్యూరు శేషసాయి, కౌండిన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply