రోబోటిక్ న్యూరో సర్జరీ అండ్ న్యూరో ఎండోస్కోపీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ప్రారంభించిన యశోద హాస్పిటల్
సికింద్రాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ : యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో నిర్వహిస్తున్న “స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్-2025” రెండు రోజుల ఇంటర్నేషనల్ సమ్మిట్ అండ్ లైవ్ వర్క్ షాప్‌ను శనివారం తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్. క్రిస్టినా జెడ్ చోంగ్తు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, డాక్ట్రర్.క్రిస్టినా జెడ్ చోంగ్తు మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాలలో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు న్యూరో ఎండోస్కోపిక్ లేదా ఎండోస్కోపీ ద్వారా నిర్వహించబడే నాడీ సంబంధిత బ్రెయిన్ సర్జరీలకు యశోద హాస్పిటల్స్ భారత దేశంలోనే మొట్టమొదటి “రోబోటిక్ న్యూరో సర్జరీ అండ్ న్యూరో ఎండోస్కోపిక్” సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక చక్కని వేదిక అవుతుందని అన్నారు. మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సలలో న్యూరో ఎండోస్కోప్ గత 2 దశాబ్దాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని, ఎందుకంటే దాని మినిమల్లీ ఇన్వాసివ్ ( అతి తక్కువ కొతా ) విధానం, హై రిజల్యూషన్, వ్యాధిని పూర్తిగా తగ్గించే సామర్థ్యం, రోగి త్వరగా కోలుకోవడం వంటివి ఈ అత్యాధునిక “రోబోటిక్ న్యూరోసర్జరీ & న్యూరో ఎండోస్కోపీ” సర్జరీల యొక్క ప్రత్యేకతలు అని అన్నారు.

యశోద హాస్పిటల్‌లో రోబోటిక్ న్యూరో సర్జరీ అండ్ న్యూరో ఎండోస్కోపీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ప్రారంభిస్తున్న దృశ్యం.
యశోద హాస్పిటల్స్, సీనియర్ న్యూరో సర్జన్ & స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్ కన్వీనర్, డాక్టర్. ఆర్. అయ్యదురై మాట్లాడుతూ… ఈ సమ్మిట్ భారతదేశంలోనే న్యూరో సర్జరీ రంగంలో నిర్వహించబడిన మొట్టమొదటి అంతర్జాతీయ “స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్” లైవ్ వర్క్ షాప్ అని అన్నరు. వైద్య రంగంలో రోబోటిక్ సహాయం ఒక గొప్ప వరంలా మిగిలిపోతుందన్నారు. ముఖ్యంగా మెదడు సర్జరీల కోసం ఉద్దేశించిన రోబోటిక్ వ్యవస్థ చాలా సున్నితమైనదని, ఇది శస్త్రచికిత్స భద్రతను అసమానమైన స్థాయికి పెంచుతుందని, బ్రెయిన్ సర్జరీలను విజయవంతం చేస్తుందని డాక్టర్. అయ్యదురై అన్నారు. యశోద హాస్పిటల్స్ రోబోటిక్ న్యూరోసర్జరీ సెంటర్ భారతదేశంలో ఇదే మొదటిదని అన్నారు. సర్జరీ సమయంలో బ్రెయిన్ లోతైన నిర్మాణాలను చేరుకోవడానికి, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన న్యూరోసర్జికల్ పరిస్థితుల యొక్క గామేట్ కు ఈ రోబోట్ పరిష్కారాన్ని అందిస్తుందన్నారు. అధునాతన బ్రెయిన్ సర్జరీలు అవసరమైన అనేక అంతర్జాతీయ రోగులకు సైతం సేవలను అందించడానికి యశోద హాస్పిటల్స్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందనీ, దేశ వ్యాప్తంగా, విదేశాల నుండి వచ్చే న్యూరోసర్జన్లకు ధృవీకరించబడిన శిక్షణా కేంద్రంగా కూడా యశోద ముందంజలో ఉంటుందని డాక్టర్. అయ్యదురై అన్నారు.
భారతదేశంలోనే మొదటిసారిగా సంక్లిష్టమైన “బ్రెయిన్ ట్యూమర్స్” సర్జరీల కోసం అత్యంత అధునాతన “రోబోటిక్ న్యూరో సర్జరీ అండ్ ప్రపంచస్థాయి “న్యూరో ఎండోస్కోపీ” సెంటర్ ను ప్రారంభిస్తూ యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ,.. “స్కల్ బేస్ ఎండోస్కోపీ ఇంటర్నేషనల్ సమ్మిట్ అనేది ఎండోస్కోపిక్ ట్రాన్స్ ఆర్బిటల్ విధానంలో మరొక మైలురాయి, ఈ సమ్మిట్‌లో ఎండోస్కోపిక్ స్కల్ బేస్ అనాటమీ యొక్క సంక్లిష్ట చికిత్సలు, వైద్య రంగంలో సవాళ్లు దేశ విదేశాల నుండి వచ్చిన ప్రఖ్యాత న్యూరో వైద్య నిపుణుల మధ్య వైద్య విజ్ఞానాన్ని, త్రీడీ అనాటమీ సెషన్ల ద్వారా పంచుకోవడానికి ఒక సరైన వేదికగా నిలిచిందని అన్నారు. ఈ రోజు మేము అత్యంత సంక్లిష్టమైన “బ్రెయిన్ ట్యూమర్” సర్జరీల కోసం అత్యంత అధునాతనమైన “రోబోటిక్ న్యూరో సర్జరీ అండ్ న్యూరో ఎండోస్కోపీ” సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంబించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రోబోట్ సహాయంతో ఎండోస్కోపీ పిన్ హోల్స్ సర్జరీ ద్వారా లోతైన బ్రెయిన్ ట్యూమర్ ను ఎంతో ఖచ్చితత్వంతో పూర్తి సురక్షితంగా, విజయవంతంగా తొలిగించడానికి వీలవుతుందన్నారు. ఇది మెదడులో గడ్డలు, మూర్ఛ వ్యాధి శస్త్రచికిత్సలో కూడా అత్యంత ప్రభావంతంగా పనిచేస్తుందని డాక్టర్. పవన్ గోరుకంటి వివరించారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ యూనిట్ హెడ్ డాక్టర్. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరో-సర్జరీ బృందం, 500 మందికి పైగా న్యూరో సర్జన్లు, న్యూరాలజిస్ట్‌లతో పాటు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రఖ్యాత న్యూరో వైద్య నిపుణులు ఈ సమ్మిట్ లో పాల్గొని ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసారని డాక్టర్. విజయ్ కుమార్ తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply