యువ‌త మ‌త్తు పదార్థాలకు దూరండా ఉండాలి – చిక్క‌డ‌ప‌ల్లి ఇన్‌స్పెక్ట‌ర్ రాజు నాయ‌క్

హైదరాబాద్, జూన్ 25, అద్దం న్యూస్ :   యువ‌త మ‌త్తు పదార్థాలకు దూరండా ఉండాలని చిక్క‌డ‌ప‌ల్లి ఇన్‌స్పెక్ట‌ర్ రాజు నాయ‌క్ అన్నారు. అప్స స్వచ్ఛంద‌ సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లి పోలీస్‌స్టేష‌న్ సమన్వయ సహకారంతో అంతర్జాతీయ. మత్తు పదార్థాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని అప్స స్వచ్ఛంద‌ సంస్థ, వివిధ స్తానిక సంస్థలు, యువతి యువ‌కులు, పోలీస్ అధికారులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వ‌హించారు. చిక్కడపల్లి పోలీస్‌స్టేష‌న్ నుండి చిక్కడపల్లి గ్రంథాలం వరకు ఈ ర్యాలీ జ‌రిగింది. వద్దు… వద్దు మత్తు పదార్థాలు వద్దు… చేద్దాం… చేద్దాం మత్తు పదార్థాలను దూరం చేద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిక్కడపల్లి ఇన్‌స్పెక్ట‌ర్ బి.రాజు నాయ‌క్ హాజ‌రై మాట్లాడుతూ.. నేటి యువత ప్రతి 100 మందిలో 10 మంది మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారన్నారు. నేటి యువత తమ తమ లక్ష్యాలు నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజ చేయడమే తెలంగాణ రాష్ట్ర ఉద్దేశ్యమ‌న్నారు. యువత గాంజా, మత్తు పదార్థాలు మత్తు సిరబ్, కొకైన్, మత్తు చాక్లెట్, సిగరెట్‌లో మత్తు లాంటివి ఎవరన్నా వాడుతుంటే వెంటనే 100 కు గాని… 1446 గాని…1908 ఉచిత కాల్ చేయాల‌ని సూచించారు. ఎవరన్నా యువత మత్తు పదార్థాలతో పట్టుబడిన వారికి లక్ష రూపాయల జరిమానా.. ఒక సంవ‌త్స‌రం జైలు శిక్ష ప‌డుతుంద‌న్నారు. అప్స లాంటి స్వచ్ఛంద‌ సంస్థలు ఇలాంటి మత్తు పదార్థాల నివారణ కొరకు అవగాహన నిర్వహించడం అభినందనీయ‌మ‌న్నారు. అప్స స్వ‌చ్ఛంద సంస్థ సీనియ‌ర్ కో–ఆర్డినేట‌ర్లు బొట్టు ర‌మేష్, బ‌స‌వ రాజు లు మాట్లాడుతూ.. అప్స సంస్థ మహానగరంలో సుమారు 50 బస్తీలలో యువతి యుకులు చెడు దారిన పడకుండా వారికి వివిధ నైపుణ్య శిక్షణ‌లు ఇవ్వడమేకకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి పోలీస్‌స్టేష‌న్ డిఐ శంకర్, ఎస్ఐ అభిలాష్, జంగయ్య గౌడ్, శివ ప్రసాద్, గంగాధర్, అప్స స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంజుల, లావణ్య, రాజేశ్వరి, శోభా, ఇందిర, మల్లికా, రెసిడెన్సియ‌ల్‌ వెల్ఫేర్ ప్రతినిధి శ్రీలత, పీస్ కమిటీ సభ్యుడు ఖదిల్, జ‌న‌ని ఫౌండేష‌న్ నాయ‌కుడు మల్లేష్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page