విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి
– ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్
హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌లో విద్య రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలని సోమవారం ఆప్ రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేశారు.
ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ విద్య రంగంలో దేశంలో చివరి స్థానంలో ఉండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 90 శాతానికి
ఉన్న అట్టడుగువర్గాలు అభివృద్ధి పధంలో పయనించాలంటే విద్యకు అధిక నిధులు కేటాయించి వారి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా వెంటనే చెల్లించాలని. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ ప్రాముఖ్యతను గుర్తించాలని, ఈ బడ్జెట్‌లో విద్యకు అధిక నిధులు కేటాయించవలసిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల మూసివేతను తక్షణమే నిలిపివేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల సమస్యలను పరిష్కరించి, మౌలిక సౌరకార్యాలు కల్పించి, బలోపితం చేసి, ఖాళీగా ఉన్న టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్ర విద్య కమిషన్ రిపోర్టును వెంటనే అమలు చేయాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply