...

బసవరాజ్ శ్రీనివాస్ ను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి

బసవరాజ్ శ్రీనివాస్ ను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి
– తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్షలో వ‌క్త‌ల డిమాండ్

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 25, ( అద్దం న్యూస్ ) :  తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా మాట్లాడిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ పై చ‌ర్య‌లు తీసుకోవాలని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప‌లువురు వ‌క్త‌లు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా మాట్లాడిన సవరాజ్ శ్రీనివాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక సంయుక్తాధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్‌లో మంగ‌ళ‌వారం తెలంగాణ ఆడ‌బిడ్డ‌ల ఆత్మ‌గౌర‌వ దీక్ష జ‌రిగింది. డాక్ట‌ర్‌.యజ్ఞం పవన్‌కుమార్‌ శర్మ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ దీక్ష‌కు మ‌ద్ద‌తుగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాల‌య ప‌రిష‌త్ మాజీ చైర్మ‌న్ అయాచితం శ్రీధ‌ర్‌, కార్పొరేష‌న్ల మాజీ చైర్మ‌న్లు దేవి ప్ర‌సాద్, ప‌ల్లె ర‌వి, బిజెపి నాయ‌కుడు వంశీ తిల‌క్, నైసథం సత్యనారాయణమూర్తి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్‌.యజ్ఞం పవన్‌కుమార్‌ శర్మ మాట్లాడుతూ…తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా మాట్లాడిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ పై క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకుని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను సహించబోమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వారిని ప్రభుత్వం గౌరవించి, వారికి తగిన గుర్తింపు కల్పించాలని కోరారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ బాధ్యతలను తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని వ్యక్తులకు అప్పగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

ర్మ‌న్లు దేవి ప్ర‌సాద్, ప‌ల్లె ర‌వి, బిజెపి నాయ‌కుడు వంశీ తిల‌క్, నైసథం సత్యనారాయణమూర్తి త‌దిత‌రులు మాట్లాడుతూ… ఉద్యమకారులపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలతోపాటు దళిత మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఘటనలను తీవ్రంగా ఖండించారు. కులం కంటే గుణానికే ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాలతో సామరస్యంగా జీవించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని అన్నారు. మహిళలను గౌరవించడం, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని కోరారు. కులదురహంకార ధోరణులకు అడ్డుకట్ట వేసి, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గంప రామారావు, అవునూరి రమణారావు, గూడ రాజేశ్వరరావు, రవికిరణ్‌, పోలంపల్లి రమణ, ప్ర‌సాద్ రావు, సుమ‌ల‌త‌, చింత స్వామి మాదిగ‌ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.