వైన్స్ టెండర్లలో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలి
– సీఎం రేవంత్‌రెడ్డికి లేఖలు రాయాలని అన్ని పార్టీల నేతలకు వినతులు
హైదరాబాద్, సెప్టెంబర్ 11, అద్దం న్యూస్ : వైన్స్ టెండర్లలో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్ని పార్టీల నేతలను ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా కోరారు. ఈ మేరకు గురువారం వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే కల్పించాలని, సీఎం రేవంత్‌రెడ్డికి ఒక లెటర్ రాయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావును ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా ఆధ్వర్యంలో సంఘం నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా మాట్లాడుతూ… మటన్ వృత్తి, సారా వృత్తి జన్మతః ఆరె కటికలదేనని, 2021లో అప్పటి ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీలో సైతం అన్యాయం చేసిందన్నారు. ఎక్సైజ్ పాలసీకి ఏ మాత్రం సంబంధంలేని గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కట్టబెట్టించారని అన్నారు. 79 సంవత్సర కాలంలో ఆరె కటిక కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. 2020 నుంచి 2023 సంవత్సరం వరకు 10 ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారని, మటన్ వృత్తిని సాగించలేక అప్పులపాలై కుటుంబాన్ని పోషించుకోలేక బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. వైన్స్ టెండర్లలో 30 శాతం ప్రత్యేక కార్పొరేషన్‌ను కల్పించాలని, 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply