చిక్కడపల్లి, నవంబర్ 20, ( అద్దం న్యూస్ ) :
హైదరాబాద్ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర గ్రంథాలయం చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి అలివేలు లు హాజరయ్యారు. భారతీయ విద్యా భవన్ స్కూల్ విద్యార్థులకు పోటీలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానోత్సవం చేశారు. అదే విధంగా మహిళా ఉద్యోగులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు పోటీలకు గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో చంద్రకళ, ద్వితీయ శ్రేణి గ్రంథపాలకురాలు పద్మశ్రీ. బొల్లం మహేందర్, సత్యం, జంగారెడ్డి, అనీలు, శ్రీనివాస్ రాజ్, అమరావతి, ఉమా, రేణుక, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.








