Friday, November 20, 2026
No menu items!
HomeGREATER HYDERABADఇందిరా గాంధీ జయంతి సందర్భంగా న‌వీన్ నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా న‌వీన్ నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

బాగ్‌లింగంపల్లి, న‌వంబ‌ర్ 19, ( అద్దం న్యూస్ ) :

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వి.నవీన్ నాయ‌క్‌ నాయకత్వంలో డివిజన్ కార్యాలయం వద్ద గురువారం ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో జనరల్ ఫిజిషియన్ వైద్య పరీక్షలతో పాటు రక్త పరీక్షలు, ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాదవ్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమాజ సేవ, ప్రజాసంక్షేమం పట్ల నిబద్ధతతో ముందుకు సాగిన ఇందిరా గాంధీ ఆశయాలను స్మరించుకుంటూ, రక్తదానం వంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అంజి యాదవ్, భూపాల్, బాబా షర్ఫుద్దీన్, శ్రీకర్, బబ్లూ, రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page