Thursday, November 19, 2026
No menu items!
HomeCultureసిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో క‌వి స‌మ్మేళ‌నం

సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీలో క‌వి స‌మ్మేళ‌నం

📰 Generate e-Paper Clip

గాంధీన‌గ‌ర్‌, ( అద్దం న్యూస్ ) :

హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లి వట్టికోట ఆళ్వార్‌ స్వామి నగర కేంద్ర గ్రంథాలయంలో 59 వ గ్రంధాలయ వార్షికోత్సవ సందర్భంగా గ్రంధాలయాల ప్రాముఖ్యత పుస్తక పఠనం, అంశాలపై జరిగిన కవి సమ్మేళనం జ‌రిగింది. 17 మంది కవులు పాల్గొని కవిత గానం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ నగర గ్రంధాలయ సంస్థ కార్యదర్శి ఎం.అలివేలు హాజ‌ర‌య్యారు. ఆమెతో పాటు గ్రేడ్-1 లైబ్రేరియన్ ఎల్.చంద్రకళ, గ్రంధాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తంగెళ్లపల్లి కనకాచారి కవి సమ్మేళనాన్ని నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు, జర్నలిస్ట్ జయ సూర్య, చామర్తి వాణిశ్వర శాస్త్రి, బొల్లిముంత వెంకటరమణ, విజయభారతి, పొన్నాల బాలయ్య, సలీమా, మిద్దె సురేష్, డాక్టర్ కృష్ణ ప్రసాద్, పరిమి వెంకట సత్యమూర్తి, డాక్టర్.చిదెళ్ల సీతాలక్ష్మి, కాసర్ల సరోజ దేవి, సారధి రమేష్, అనంతుల రాజేశ్వరి, శోభా దేశ్పాండే కవితా పఠనం చేశారు.

  ఈ సందర్భంగా కవులందరినీ ఆత్మీయంగా సత్కరించారు. గ్రంధాలయాల ప్రాముఖ్యతను పుస్తక పఠనం విలువను యువత విద్యార్థులు తెలుసుకోవాలని వక్తలు వివరించారు. గ్రంథాలయ ఉద్యమ చరిత్రను వివరించారు. ప్రభుత్వాలు ప్రజల్లో గ్రంధాలయాల మక్కువ పెంచాలన్నారు. స్కూల్ బాలలకు స్లోగన్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. స్ఫూర్తి కల్గించే పాటలను పాడి తమ ప్రతిభ చాటారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page