Friday, September 18, 2026
HomeHyderabadకాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి – అంబ‌ర్‌పేట్‌ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వక్తలు

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి – అంబ‌ర్‌పేట్‌ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వక్తలు

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
– అంబ‌ర్‌పేట్‌ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వక్తలు

స‌మావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు, అంబ‌ర్‌పేట్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి
 స‌మావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు, అంబ‌ర్‌పేట్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి

అంబ‌ర్‌పేట్‌, మే 23, అద్దం న్యూస్‌ :   కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పలువురు వత్తులు అన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంత రావు, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు, అంబ‌ర్‌పేట్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబ‌ర్‌పేట్‌ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం ఓ హోటల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ జిల్లా ప‌రిశీల‌కులు వినోద్ కుమార్, సౌజన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా కార్యచరణను రూపొందించి, దశ నిర్దేశించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం వి.హనుమంతరావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని బూతు స్థాయి నుండి రాష్ట్రస్థాయిలలో బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంబ‌ర్‌పేట్‌ ఇన్చార్జ్ రోహిన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఆర్.లక్ష్మణ్ యాదవ్, మాజీ ఫ్లోర్ లీడర్ పుల్లా నారాయణ స్వామి, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్, లక్ పతి యాదగిరి గౌడ్, మాజీ కార్పొరేటర్లు దిండి రాంబాబు, గరిగంటి రమేష్, పులి జగన్, హరినాథ్ రెడ్డి టిపిసిసి సెక్రెటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్,ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపునూరి కృష్ణ గౌడ్, డివిజన్ అధ్య‌క్షులు, బ్లాక్ అధ్య‌క్షులు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page