
హైదరాబాద్, మే 29, అద్దం న్యూస్ : జలమండలి ఓ అండ్ ఎం డివిజన్–8 బాలాపూర్ సెక్షన్ ఆఫీస్, అలియాబాద్ రిజర్వాయర్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ గురువారం తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించిన ఈడి వాటర్ సప్లై, సీవరేజ్ పనులు, రెవెన్యూ బిల్లింగ్, కలెక్షన్, ఎంసీసీ ఫిర్యాదుల పరిస్కారం తదితర అంశాలపై ఆరా తీశారు. కలుషిత నీటి ఫిర్యాదుల పరిష్కారం, క్లోరిన్ శాతం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సిజీఎం వినోద్ భార్గవ, జిఎంతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
