Friday, September 18, 2026
HomeHyderabadటిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా బాల‌కృష్ణ బ‌ర్త్ డే వేడుక‌లు

టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా బాల‌కృష్ణ బ‌ర్త్ డే వేడుక‌లు

హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ :   తెలుగుదేశం హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. మంగ‌ళ‌వారం టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ కేక్ కట్ చేసారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మ‌న్‌గా బాలకృష్ణ ఎంతో మంది సామాన్య పేదలకు క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చి సమాజం పట్ల తనకున్న సేవాతత్పరతను నిరూపించుకున్నారన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేద, క్యాన్సర్ రోగులకు సేవ చేయటంలో సేవ చేయాలనే లక్ష్యంతో బాలకృష్ణ ఆస్పత్రి నడుపుతున్నారని, అదే విధంగా తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్టీఆర్ ఆశయాల వారసునిగా, కథా నాయకుడిగా 100కు పైగా సినిమాలు పూర్తి చేసి శత చిత్ర సుందరుడయ్యారన్నారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు పురస్కారించడంతో బాలకృష్ట అభినందనలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసారు. సమాజ సేవే లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఆదాయమే పరమావధిగా తయారయ్యాయని, ఇటీవలే మెట్రో రైలు చార్జిలు పెంచిన ప్రభుత్వం గోరు చుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బస్‌ చార్జీలు పెంచి ప్రజావ్యతిరేక ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలూ రాక విధ్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్నారని, వెంటనే పెంచిన బస్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజు గౌడ్, టిడిపి నాయ‌కులు ఎస్.ప్రకాష్, ఝాన్సీ, శ్రీనివాస్ గౌడ్, కట్టరాములు, ఎం.రాజు, భాను ప్రకాష్, కిరణ్, పి.వీరబాబు, అనిల్ కురుమ, రామారావు, సాంబశివ రావు, జి.ప్రవీణ్, జగదీష్ గౌడ్ ఎన్.శ్రీనివాస్, శేఖర్, సుక్రవేది, కృష్ణస్వామి, మందా వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page