Friday, September 18, 2026
HomeHyderabadఅడ్డగుట్టను అభివృద్ధి చేసిన ఘనత మాదే – సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

అడ్డగుట్టను అభివృద్ధి చేసిన ఘనత మాదే – సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

అడ్డగుట్టను అభివృద్ధి చేసిన ఘనత మాదే

– సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్


సికింద్రాబాద్, జులై 18, అద్దం న్యూస్ :   అడ్డగుట్టలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచి ప్రజలకు ఉపకరించే కార్యక్రమాలు చేపట్టామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన అడ్డగుట్టలో రూ.3.60 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న కమ్యూనిటిహాల్ పనులను ప్రారంభించారు. అడ్డగుట్ట డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అడ్డగుట్ట కమ్యూనిటీహాల్‌ను నిర్మించేందుకు రూ.2.25 కోట్ల నిధులను గతంలోనే మంజూరు చేశామని, అదనంగా రూ.1.45 కోట్ల నిధులు కేటాయించి, అన్ని సదుపాయాల ఫంక్షన్ హాల్‌ను నిర్మించేందుకు ఏర్పతులు జరుపుతున్నామని తెలిపారు. 50 సంవత్సరాలుగా కేవలం కాగితాలకే పరిమితమై, నాయకుల వాగ్దానాలకే పరిమితంగా నిలిచిన తుకారాం గేటు ఆర్‌యుబి నిర్మాణం పనులు ఎట్టకేలకు తమ హయంలో రూ.74 కోట్ల ఖర్చుతో నిర్మించామని, బోయబస్తీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఫంక్షన్ హాల్స్ నిర్మాణం, శాంతి నగర్ నాలా విస్తరణ, శాంతినగర్ మోడల్ మార్కెట్ నిర్మాణం, నార్త్ లాలాగూడ కబరస్తాన్ అభివృద్ధి, శేశాపహాడ్ ఈద్గా అభివృద్ధి, శాంతినగర్ రిజర్వాయర్, మారేడ్‌ప‌ల్లి రిజర్వాయర్ నిర్మాణం తమ హయంలో జరిగాయని తెలిపారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ ప్రభుత్వ హయంలో అడ్డగుట్ట కు కొత్త రూపాన్ని కల్పించామని, డ్రైనేజి, మంచినీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. లోహియా నగర్‌లో బండ రాళ్లు గుడిసెల పై పడకుండా రూ.32 లక్షలతో రేటైనింగ్ వాల్స్ నిర్మించామని, అడ్డగుట్టలో 506 గ్రూప్ లకు రుణాలను మంజూరు చేయించామని, రికార్డు సంఖ్యలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పవర్ బోరింగ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.13.05 కోట్ల నిధులను మంజూరు చేయించామని, నిర్మాణం పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక నిధుల నుంచి రూ.30 లక్షలతో అడ్డగుట్టలో రెండు ప్రభుత్వ స్కూల్స్‌ను అభివృద్ధి చేశామని, రూ.రెండు లక్షల విరాళం అందించి వ్యక్తిగత నిధులతో ప్రభుత్వ స్కూల్‌లో కంప్యూటర్స్, ప్రింటర్స్ సమకుర్చామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. తుకారం గేటు పోలీస్‌స్టేష‌న్ పరిధిలో రూ.25 లక్షలు మంజూరు చేసి సిసి. కెమెరాలు ఏర్పాటు చేశామని, వివిధ పార్కులను అభివృద్ధి చేశామని సమోసా గార్డెన్, కొండా రెడ్డి నగర్, తుకారాం గేటు పార్కులు ప్రజలకు ఉపకరిస్తున్నాయని తెలిపారు. మొండి బండ నగర్ పార్కు అభివృద్దికి నిధులు మంజూరు చేసినప్పటికీ అభివృద్ధి పనులను రైల్వే అధికారులు అడ్డుకున్నారని, దీనిపై అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. తమ సమస్యలకు ప్రజలు తమను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ… అడ్డగుట్ట సర్వతోముఖభివ్రుద్దికి కృషి చేస్తున్నామని తెలిపారు. శాసనసభ్యుడు పద్మారావు గౌడ్ సహకారంతో సమస్యల పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జిహెచ్ఎంసి అధికారులు పద్మలత, ఆశిష్ తివారి, బీఆర్ఎస్ యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్ లతో పాటు అధికారులు, నేతలు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page