Friday, September 18, 2026
HomeHyderabadడాక్ట‌ర్‌.మ‌నోహ‌ర్ షిండేను స‌న్మానించిన మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

డాక్ట‌ర్‌.మ‌నోహ‌ర్ షిండేను స‌న్మానించిన మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

 డాక్ట‌ర్‌.మ‌నోహ‌ర్ షిండేను స‌న్మానించిన మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌

హైదరాబాద్, ఆగ‌స్టు 10, అద్దం న్యూస్ :   రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్‌లో తన గురు స్థాయిలో ఉన్న నాయకులు డాక్టర్ మనోహర్ షిండే, డాక్టర్ బీరవోలు సురేందర్ రెడ్డి, వడ్ల భాగయ్య, రామచంద్రయ్య ల‌ను మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్ రాంనగర్‌లోని తన నివాసంలో సత్కరించడం జరిగింది. డాక్టర్ మనోహర్ షిండే తో పాటు 1965 నుండి తనను సంఘ కార్యాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి నైపుణ్యాన్ని, మానవ సంబంధాలు, వ్యక్తి నిర్మాణాన్ని ఏవిధంగా చేయాలో నేర్పిన డాక్టర్ బీరవోలు సురేందర్ రెడ్డి, ప్రస్తుతం ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ అఖిల భారత స్థాయిలో కార్యవర్గ సభ్యులు, జాతీయ మాజీ సంయుక్త ప్రధాన కార్యదర్శి వడ్ల భాగయ్య, తనతో పాటు ప్రచారక్ గా పని చేసి, ప్రస్తుతం వనవాసి కళ్యాణ్ ఆశ్రమంలో బాధ్యతలు నిర్వహిస్తున్న రామ చంద్రయ్య ను ఆతిధ్యం ఇచ్చిన‌ బండారు దత్తాత్రేయ ఘనంగా సన్మానించడం జరిగింది. వీరితో పాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, లోక్ సభ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డికె.అరుణ, ఏబివిపి జాతీయ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ రావు, ఎస్‌బిఐ రిటైర్డ్ జనరల్ మేనేజర్ బాల్డా అశోక్, 93 సంవత్సరాల పాత స్వయం సేవక్ రామస్వామి, దత్తాత్రేయ కుటుంబ సభ్యులు బండారు వసంత, బండారు విజయలక్ష్మి, డాక్టర్ బి.జిగ్నేష్ రెడ్డి, బి.జనార్దన్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ, రాష్ట్ర యువజన శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… తనను 1984 లో తనను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లో చేర్పించి, శిక్షణ ఇచ్చి, సంస్కారంతో తనను జాతీయ భావంతో, దేశ భక్తితో స్ఫూర్తి నింపి ప్రస్తుతం అమెరికా దేశంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల యొక్క సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వహిస్తూ కాలిఫోర్నియాలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నడాక్టర్ మనోహర్ షిండే భాగ్యనగరానికి విచ్చేసిన సందర్భంగా తన స్వగృహానికి ఆహ్వానించి శాలువాతో సత్క‌రించడం జ‌రిగింద‌న్నారు. తన గురు స్థాయిలో ఉన్న నాయకులతో ఈ కార్యక్రమం ఒక ఆత్మీయ సమ్మేళనంగా కొనసాగిందని, మంచి అనుభూతి కలిగించిందన్నారు. తమ 60 సంవత్సరాల సామజిక సేవ అనుబంధాన్ని, అనేకమైన విషయాలను, సంఘటనలకు ఈ సందర్భంగా వివరించుకున్నామని దత్తాత్రేయ తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page