జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల పోటీ
– ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెపుతాం
– సమాలోచన సదస్సులో తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరిక

హైదరాబాద్, అక్టోబర్ 8, అద్దం న్యూస్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులు పోటీ చేస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారులు స్పష్టం చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెపుతామని సమాలోచన సదస్సులో తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం భాస్కర్ ఆడిటోరియంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సమాలోచన సమావేశం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ మోహన్ బైరాగి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉద్యమ సంఘాల, ఉద్యమ జేఏసీ ల, పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొనారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారుల సంఘాల నేతలు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి, నల్లా రాధకృష్ణ, చంద్రన్న ప్రసాద్, తుల్జారెడ్డి, కంచర్ల బద్రి,షేక్ షావాలి, యాదగిరి, వెంకట మల్లయ్య, అంజలి, రాంబాబు, లావణ్య, సుధాకర్, ప్రొఫెసర్ తిరుపతి, డాక్టర్.షోయబ్, 1969 ఉద్యమకారులు బాల కిషన్ రావు, రాందాస్, ఆన్వర్ పటేల్, పాండు గౌడ్, శంకర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని నేపథ్యంలో వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులు నుండి ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టి అధికార కాంగ్రెస్ పార్టీ కి తగిన విధంగా బుద్ది చెప్తామంటూ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించకుండా కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ద కాలం అణిచివేతకు పాల్పడ్డారని విమర్శించారు. నేడు ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రెండు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉద్యమకారులను మభ్య పెడుతుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు కనీసం ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ కూడా ప్రకటించకపోవడం విచారకరం అన్నారు. అందుకే వచ్చే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ఉద్యమకారుల సత్తా చాటుతాం అంటూ వక్తలు పిలుపునివ్వడం జరిగింది. ఈ సదస్సులో రెండు వందల ఉద్యమకారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply