Friday, September 18, 2026
HomeHyderabadప్ర‌శాంతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ – 48.7 శాతం పోలీంగ్

ప్ర‌శాంతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ – 48.7 శాతం పోలీంగ్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 11, అద్దం న్యూస్ :     జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్ర‌శాంతంగా ముగిసింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌ వృద్ధులు, దివ్యాంగులు సౌకర్యవంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లను చేశారు. 48.7 శాతం పోలింగ్ జ‌రిగిన‌ట్టు అధికారులు తెలిపారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏడో అంతస్తులో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ పర్యవేక్షణ, పిఆర్ఓ యాప్ ఇన్ ఈసీఐ నెట్ కంట్రోల్ కేంద్రాన్ని సాధారణ పరిశీలకులు రంజిత్‌ కుమార్‌ సింగ్‌ జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ తో కలిసి మంగళవారం పరిశీలించారు.

జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూం ను అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, జాయింట్ కమిషనర్ రాధా లు ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఎప్పటికపుడు వెబ్ కాస్టింగ్ ద్వారా జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తూ పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు.

                                               కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పిఆర్ ఓ యాప్ ఇన్ ఈసీఐ నెట్ లో ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలైన ఓట్లను ప్రిసైడింగ్ అధికారులు నమోదు చేసేలా చూసారు. జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ ఎన్నికల సామాగ్రి స్వీకరణ ప్రక్రియ పరిశీలించారు. ఉప ఎన్నిక పోలింగ్ పూర్తి అయిన తర్వాత పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాల నుండి తిరిగి యూసఫ్‌గూడ‌లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని రిసిప్షన్ సెంటర్ కు ( స్వీకరణ కేంద్రం ) తీసుకువచ్చి అప్పగించారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు రంజిత్‌ కుమార్‌ సింగ్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి.కర్ణన్ పరిశీలించారు. అనంతరం ఈవీఎంలను పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల ( సీసీ టీవీ కెమెరాలు, సాయుధ బలగాలతో ) మధ్య కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోనీ స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page