Friday, September 18, 2026
HomeHyderabadబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద...

బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 12, అద్దం న్యూస్ :   బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్ లు డిమాండ్ చేశారు. బుధ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ… కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు “త్రీ-టెస్ట్” (Dedicated Commission, empirical data/caste survey, and 50% limit) ఫార్ములాను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కూడా డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం ప్రస్తుతం చట్టపరమైన, రాజకీయపరమైన చర్చలకు, పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉందన్నారు. బీసీల జనాభా వారి రిజర్వేషన్ల కంటే ఎక్కువగా ఉంది కాబట్టి, వారి జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్ట సభల్లో బీసీలకు జనాభా ప్రతిపాదికన రిజ‌ర్వేష‌న్ల‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని కోరారు.



 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page