Friday, September 18, 2026
HomeHyderabadఆన్‌లైన్ ఆర్థిక నేరాల‌తో జాగ్ర‌త్తండా ఉండండి – సెంట్ర‌ల్ జోన్ అడిష‌న‌ల్ డిసిపి ఆనంద్

ఆన్‌లైన్ ఆర్థిక నేరాల‌తో జాగ్ర‌త్తండా ఉండండి – సెంట్ర‌ల్ జోన్ అడిష‌న‌ల్ డిసిపి ఆనంద్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 15, అద్దం న్యూస్ :      ఆన్‌లైన్ ఆర్థిక నేరాల‌తో జాగ్ర‌త్తండా ఉండాల‌ని సెంట్ర‌ల్ జోన్ అడిష‌న‌ల్ డిసిపి ఆనంద్ అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌రంలోని దోమ‌ల‌గూడ ఏవి కాలేజీలో సైబ‌ర్ నేరాల పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా సెంట్ర‌ల్ జోన్ అడిష‌న‌ల్ డిసిపి ఆనంద్, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఏసిపి యాద‌గిరి, దోమ‌లగూడ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ అంజ‌ద్ అలీ, డిఐ సుధాక‌ర్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సెంట్ర‌ల్ జోన్ అడిష‌న‌ల్ డిసిపి ఆనంద్ మాట్లాడుతూ… పరిచితుల నుండి వచ్చే లింక్‌లు, మెసేజ్‌లు తెరవ‌ద్ద‌ని, మీ OTP, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవ‌ద్ద‌ని, మీ సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ( Fake Accounts ) లేదా అనుమానాస్పద స్నేహితుల అభ్యర్థనలను అంగీకరించవ‌ద్ద‌న్నారు. సైబర్ నేరానికి గురైతే, వెంటనే 1930 అనే జాతీయ సైబర్ హెల్ప్ లైన్‌కు కాల్ చేయాల‌ని, లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. నకిలీ వెబ్‌సైట్లు లేదా యాప్‌ల ద్వారా మోసం జ‌రుగుతుంద‌ని, ఉద్యోగాలు, బహుమతుల పేరుతో డబ్బు వసూలు చేయడం జ‌రుగుతుంద‌న్నారు.

సెయింట్ పాయీస్ స్కూల్‌లో  సైబ‌ర్ నేరాల పై అవ‌గాహ‌న :

సైబ‌ర్ నేరాల పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని రాష్ట్ర డిజిపి శివ‌ధ‌ర్‌రెడ్డి, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ ఆదేశాల మేర‌కు శ‌నివారం రాంన‌గ‌ర్ సెయింట్ పాయీస్ స్కూల్‌లో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి చిక్క‌డ‌ప‌ల్లి ఏసిపి ర‌మేష్ కుమార్‌, ముషీరాబాద్ పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు, డిఐ న‌దీమ్‌, ఎస్ఐ లు దుర్గ‌ప్ర‌సాద్‌, రాకేష్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సైబ‌ర్ నేరాల‌తో అప్ర‌మ‌త్తంగా ఉంటామ‌ని విద్యార్థుల‌తో ప్ర‌తిజ్ఞ చేయించారు.



https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page