హైదరాబాద్, నవంబర్ 15, అద్దం న్యూస్ : నియోజకవర్గం అభివృద్ధి కోసం మరిన్ని నిధులను కేటాయిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ అరవింద్‌నగర్‌లో శనివారం సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… నియోజకవర్గంలోని డివిజన్లల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిఈ సన్నీ, బిఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, శ్యామ్, గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, ముచ్చకుర్తి ప్రభాకర్, రాజేష్, జిహెచ్ఎంసి వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, అరవింద్‌నగర్ స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply