Friday, September 18, 2026
Homedevotionalశ్రీ సిద్ధి, బుద్ధి సహిత గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

శ్రీ సిద్ధి, బుద్ధి సహిత గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

హైదరాబాద్, నవంబర్ 23, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సిద్ధి–బుద్ధి సహిత గణపతి, శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై, వేదమంత్రోచ్చారణల మధ్య విగ్రహాల ప్రతిష్ఠాపన పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈఓ దేవనాథం, దేవాలయ పునర్నిర్మాణ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్ లు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించింది. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాల పంపిణీ జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, సురేష్ త‌దితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page