హైదరాబాద్, నవంబర్ 23, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ సిద్ది, బుద్ది వినాయక విగ్రహ ప్రతిష్టాపన, శ్రీ దత్తసాయి, షిరిడి సాయిబాబా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆంజనేయస్వామి గర్భాలయంలో స్వామి వారికి రామనామంతో కూడిన సంజీవిని వెండి కవచం ప్రతిష్టాపన, సీతారామ లక్ష్మణుల పంచలోహ విగ్రహాలకు పూజలు, ఆంజనేయస్వామి దేవాలయం గర్భాలయానికి వెండి తొడుగు, గడప చౌకట్‌కు వెండి తొడుగు, సుందరకాండ ఘట్టానికి సంబంధించి పంచలోహ విగ్రహ స్థాపనం, గర్భగుడి నలుదిక్కుల ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్, ఆలయ ఈవో మాచర్ల దేవనాధం ల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్, దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్‌రావు, చిక్కడపల్లి ఏసిపి రమేష్ లు హాజరయ్యారు.














Leave a Reply