జనవరి 4న సూర్యపేటలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసి బహిరంగ సభ
హైదరాబాద్, డిసెంబర్ 20, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ 2026 జనవరి 4వ తేదీన సూర్యాపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి తెలిపారు. ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరితో కలిసి బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను రాంరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాశం యాదగిరిని సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని, రూ.2500 పింఛన్ ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వంలో చలనం రావాలనే ఉద్యమకారులందరం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, ఉపాధ్యక్షులు పిడమర్తి లింగయ్య, మోహన్ బైరాగి, టియుకెవి అధ్యక్షుడు యాదగిరి, ఓయూ విద్యార్థి విభాగం నాయకుడు కంచల బద్రి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply