రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ
» జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి
హైదరాబాద్, మార్చి 1, అద్దం న్యూస్ : రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బిట్ల రమేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో యువకుల చేరిక కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జన సేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ప్రచార కార్యదర్శి ఆర్‌కె.సాగర్ నాయుడు, సినీ నటుడు తనిష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బిట్ల రమేష్ తో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా యువతకు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పొత్తులో ఉండి పోటీ చేయాలా.. లేదా అనేది ఇంకా క్లారిటీ లేదన్నారు. గ్రేటర్‌లోని 50 నుంచి 60 డివిజన్లల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉందన్నారు. ఒకవేళ పొత్తు ఉండి రాజకీయ సమీకరణాలు చేసుకుంటామన్నారు. పొత్తు లేకపోతే 200 నుంచి 250 డివిజన్లల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తదన్నారు.

జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్‌కె.సాగర్ నాయుడు, సినీ నటుడు తనిష్ లు మాట్లాడుతూ… పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి సమాజంలో గౌరవం, పార్టీలో గుర్తింపు మాత్రమే కాకుండా, ప్రమాదవశాత్తూ మరణించిన, గాయాల బారిన పడిన ఎంతోమంది జనసైనికుల కుటుంబాలకు ఆసరాగా నిలిచిందన్నారు. జనసేన సభ్యత్వం ద్వారా బీమా సదుపాయం అందచేస్తుందన్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన 953 మందికి కింద బీమా 47 కోట్ల 65 లక్షల రూపాయలను అందచేయడం జరిగిందని అన్నారు. ప్రమాదవశాత్తూ గాయపడిన 527 మందికి సుమారు పద్దొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు పైచిలుకు అందజేయడం జరిగిందన్నారు. జనసేన సాధక్” ను సంప్రదించి జనసేన ఉద్యమి సభ్యత్వం కోసం నమోదు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ముషీరాబాద్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బిట్ల రమేష్ మాట్లాడుతూ… ముషీరాబాద్ నియోజకవర్గంలో జోరుగా జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు చేయించామన్నారు. అలాగే పార్టీ జనసేన ఉద్యమి సభ్యత్వాన్ని నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతుందని అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తామని అందుకోసం యువతను అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీకి చెందిన పలు డివిజన్ల అధ్యక్షులు నరేష్, కళ్యాణ్, పవన్ గౌడ్, సుబ్బారావు, వంశీ, ప్రవీణ్ కుమార్, వెంకట్, నాయకులు గౌరీ, రమ్య తదితరులు పాల్గొన్నారు.![]()

![]()

