భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దు
– సీఐటీయూ ముషీరాబాద్ జోన్ కార్యదర్శి మహేందర్
హైదరాబాద్, జూలై 15, ( అద్దం న్యూస్ ) : భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దని సీఐటీయూ ముషీరాబాద్ జోన్ కార్యదర్శి మహేందర్ అన్నారు. సిఐటియు ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి లేబర్ అడ్డా దగ్గర ఈ నెల 20 వ తేదీన లేబర్ కమిషనర్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నాను జయప్రదం చేయాలని జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ముషీరాబాద్ జోన్ కార్యదర్శి మహేందర్ మాట్లాడుతూ…. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు జీవో నెంబర్ 12 ద్వారా అప్పగించి దాదాపు 346 కోట్లు నిబంధనలను ఉల్లంఘించి కట్టబెట్టారని విమర్శించారు. కార్మికులకు ఇలాంటి ప్రయోజనం లేని సిఎస్సి సంస్థ ద్వారా హెల్త్ టెస్టులు చేయించుతూ 750 కోట్లు ఆ సంస్థకు ప్రభుత్వం దోచిపెట్టిందని అన్నారు. వెల్ఫేర్ బోర్డు స్కీములు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని సిఎస్సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని బోర్డు నిధులు కార్మికుల సంక్షేమ కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పిల్లల చదువులకు స్కాలర్షిప్ల తదితర పెండింగ్ సమస్యలను మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 20 న లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వాలు కార్మికుల కడుపులు కొడుతూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా భవన నిర్మాణాలు బోర్డ్ స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ సిఐటియు నాయకులు సి.మల్లయ్య, అడ్డ నాయకులు, వెంకటయ్య, రాములు, బారతి, బాలు, కిషన్, లక్ష్మణ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.![]()

![]()
