ఎస్బిఐ బ్యాంక్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్, మే 4, అద్దం న్యూస్ : సికింద్రాబాద్లోని ఎస్బిఐ బ్యాంక్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్ దగ్గర ఎస్బిఐ బ్యాంకు రెండవ అంతస్తులోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అదుపు చేసినప్పటికి మంటలు అదుపులోకి రాలేదు. భారీ మంటలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ నిండిపోయింది. ఆదివారం కావడంతో బ్యాంక్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం కలుగలేదు… కానీ కొన్ని రికార్డులు కాలిపోయాయి. విద్యత్ సర్క్యూట్ వల్లనే బ్యాంక్లో అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png