ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమీషన్‌ను వేయాలి – ఎమ్మెల్సీ కోదండరాం, రిటైర్డ్ జ‌డ్జి చంద్ర‌కుమార్‌

ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమీషన్‌ను వేయాలి

– ఎమ్మెల్సీ కోదండరాం, రిటైర్డ్ జ‌డ్జి చంద్ర‌కుమార్‌

హైదరాబాద్, జులై 3, అద్దం న్యూస్ :    తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కమీషన్‌ను వేయ్యాలని ఎమ్మెల్సీ కోదండ‌రాం, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ లు అన్నారు. గురువారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏ ఆకాంక్షతో రాష్ట్రం ఏర్పడిందో దాన్ని గుర్తించి ఉద్యమకారులను గౌరవించాలన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే అదే తరహాలో ప్రభుత్వానికి ఉద్యమకారులు నిరసన తెలియజేయాల న్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగిన ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్న‌ది.. చనిపోయినవారి కుటుంబాలు, జైలుకు వెళ్ళిన వారి వివరాలను సేకరించి 3 నెలలోపు ఉద్యమకారుల లిస్టును తయారు చేసి ప్రకటించాలని కోరారు. ఎమ్మెల్సీ కొదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల స్టీరింగ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు విమలక్క, ప్రపూల్ రామిరెడ్డి, కె.గోవర్ధన్, జి. ఝాన్సీ, మన్నారం నాగరాజు, ఆనందం, కుమార స్వామి, మోహన్ బైరాగి, గొల్లపల్లి దయానంద్, చంద్రన్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page