సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తిష్టవేసిన ఒప్పంద ఉద్యోగిపైన సమగ్ర విచారణ చేపట్టాలి : గలిబే విశాల్ 

 

 

హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ :    నిరుపేద బాధితుల అసమర్థతను ఆసరాగా చేసుకుంటూ కాంట్రాక్ట్ ఉద్యోగి అన్నీ తానై వ్యవహరిస్తూ రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ అజిస్ట్రార్లకు మామూళ్లు అప్పగిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న ఆ ఉద్యోగిపైన ఏసీబీ విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, సురక్ష యోజన వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గలిబే విశాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం గోషామహల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గలిబే, విశాల్ మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లా (పస్తుత మెదక్ జిల్లా) రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మణ్ అలియాస్ లక్ష్మీనారాయణ గత 19 సంవత్సరాలుగా జిల్లా రిజిస్ట్రార్కు పీఏగా కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. దాదాపు 8 మంది రిజిస్ట్రార్ లు బదిలీపై వెళ్లారు కానీ ఇప్పటివరకు లక్ష్మణ్ పై బదిలీ చేయలేదన్నారు. దీనికి కారణం అతను అన్ని జిల్లా రిజిస్ట్రార్లకు తానే కలెక్షన్ ఏజెంట్, అనధికారిక జిల్లా రిజిస్ట్రార్ హోదా నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. ఈ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎవరు సెలవు పెట్టినా, ఎవరికీ డిప్యూటేషన్ వేయాలన్నా, ఎవరికి బదిలీ కావాలన్నా లక్ష్మణ్ డీల్ చేయాల్సిందే… లేకపోతే ఆ పని జరగదన్నారు. ఇతనికి ఇంత చొరవ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటో అర్థం కావడం లేదని కిందిస్థాయి ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేసే సబ్ రిజిస్ట్రార్ల నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు ఎవరికి ఏ పని అయినా లక్ష్మణ్ ను సంప్రదిస్తేనే తర్వాత జిల్లా రిజిస్ట్రార్లు స్పందిస్తారన్నారు. ఈ రిజిస్ట్రార్లో పనిచేసూ ప్రతిరోజు రూ.30 నుంచి 40 వేల వరకు అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్ అయి కావాలంటే వారి వద్ద నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఆయనకు డబ్బులు ముట్టజెప్పాల్సిందే. ముఖ్యంగా సొసైటీ రిజిస్ట్రేషన్ రెన్యువల్కు రూ.2 వేలు వసూలు చేస్తున్నారన్నారు. ఇతని ఆగడాలకు ప్రస్తుత ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఓ డీఐజీ స్థాయి అధికారి అండదండలతో విచ్చలవిడిగా సంపాదించుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. లక్ష్మణ్ ఫై గతంలో పలు ఫిర్యాదులు వచ్చినా రిజిస్ట్రార్ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. ఇతను గత 20 సంవత్సరాలుగా రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఎంత డబ్బులు సంపాదించాడనే విషయంపై ఏసీబీ ఆరా తీస్తే అతని ఆస్తుల వివరాలు బయటికి వస్తాయని గలిబె విశాల్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గాను ఏసీబీ విచారణ చేపడితే నిజాలు వెలుగుచూస్తాయన్నారు. ఈ దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా జరగాలని విశాల్ డిమాండ్ చేశారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page