హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ దోమలగూడ పూల్‌బాగ్‌లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ప్రమాదం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో చిన్న పిల్లలు ఆడుకునే ఊదురు పీకలు విక్రయించే మహిళ తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటన వివరాలు స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. దోమలగూడ పూల్‌బాగ్‌లో ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణం కొనసాగుతుంది. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం చిన్న పిల్లలు ఆడుకునే ఊదురు పీకలు తదితర వస్తువులు విక్రయిస్తూ పూల్‌బాగ్‌కు ఓ మహిళ వచ్చింది. ఆమె వద్ద ఒక మహిళ ఊదురు పీకలను కొనుగోలు చేసింది. అయితే డబ్బులు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది. ఆ లోపు ఊదురు పీకలు విక్రయించే మహిళ బయట నిలబడింది. ఈ లోపు నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం పై నుంచి ఇనుప రాడ్ ఊదురు పీకలు విక్రయించే మహిళ తల పై పడింది. దీంతో మహిళ తలకు తీవ్ర గాయమైంది. ఆ మహిళకు సుమారు పది వరకు కుట్లు పడ్డాయి. ఇదిలా ఉండగా గాయపడి ప్రాణాలతో బయటపడిన మహిళకు న్యాయం చేయాలని సదరు భవనం నిర్మాణం బిల్డర్‌ను, ఓనర్‌ను అడుగగా వారు స్పందించలేదు. స్థానికులు వెళ్లి అడిగినప్పటికి సదరు బిల్డర్, భవనం ఓనరు లు దురుసుగా మాట్లాడారు. కేసు పెట్టుకుంటే పెట్టుకోండి అని.. కోర్టులో చూసుకుంటామని బిల్డర్, భవనం ఓనరు లు చెప్పారు. గాయపడ్డ మహిళకు న్యాయం జరిగేదాకా మేము పోరాడుతామని స్థానికులు చెబుతున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply