కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోవాలి

 సీఎం రేవంత్‌రెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోవాలి

– బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు ముఠా జైసింహా

– చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్య‌మ‌సార‌ధి, రాష్ట్ర తొలి సీఎం ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి పై చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు ముఠా జైసింహా కోరారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేర‌కు శుక్ర‌వారం ముఠా జైసింహా బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో రేవంత్‌రెడ్డిపై కేసు న‌మోదు చేయాల‌ని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును సీఐ రాజునాయ‌క్‌కు అంద‌చేశారు. అనంత‌రం ముఠా జైసింహా మాట్లాడుతూ… కెసిఆర్ పై చేసిన వ్యాఖ్య‌లను వెన‌క్కు తీసుకొని బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెప్పాల‌న్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్‌రెడ్డి పాల‌న‌ను ప్ర‌జ‌లంద‌రూ అస‌హ్యించుకుంటున్నార‌న్నారు. 420 హామీల పేరుతో పాటు ఆరు గ్యారెంటీల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోస‌గించి 14 నెల‌ల పాల‌న‌లో రాష్ట్రం అథోగ‌తిపాలైంద‌న్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మోడ‌ల్‌గా కెసిఆర్ చేస్తే…అదే తెలంగాణ‌ను రేవంత్‌రెడ్డి పాతాళానికి తొక్కేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముదిగొండ ముర‌ళీ, ఆకుల శ్రీనివాస్‌, పోతుల శ్రీకాంత్‌, ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, పున్న స‌త్య‌నారాయ‌ణ‌, రామ‌స్వామి, శ్రీనివాస్ గుప్త‌, ప్రేమ్‌, ఉమాకాంత్‌, దీన్‌ద‌యాల్‌రెడ్డి, జ‌హంగీర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page