హైదరాబాద్, మే 30, అద్దం న్యూస్ : కొత్త జిల్లాలకు, ఇతర ఆఫీసులకు అదనపు పోస్టులు సృష్టించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జేఏసి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ధర్నా జరిగింది. నిరుద్యోగ జేఏసి అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు మద్దతుగా రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య, తెలంగాణ ఉద్యమకారులు విఠల్, పృధ్వి, హరికృష్ణ, జర్నలిస్ట్ రఘు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య మాట్లాడుతూ… 6 సంవత్సరాల క్రితం కొత్తగా 23 జిల్లాలు ఇతర ఆఫీసులో పెద్ద ఎత్తున సృష్టించి తాలూకా, ఆఫీసులు మంజూరు చేశారు.. కానీ వీటికి ఇంత వరకు పోస్టులు సృష్టి౦చే మంజూరు చేయలేదన్నారు. కేవలం పాత పోస్టులతోనే సర్దుబాటు చేశారని, ఆఫీసర్ స్థాయి పోస్టులలో ఒక్కొక్క ఆఫీసర్ కు 3, 4 ఆఫీసులను ఇంచార్జీలను పెట్టి సర్దుతున్నారన్నారు. అలాగే 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజినల్ ఆఫీసులు, 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 25 DSP ఆఫీసులు, 31 పోలీస్ సర్కిల్స్, 7 పోలీస్ కమిషనరేట్లు, 4,383 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, మండలాలకు, మున్సిపాలిటీలకు పోస్టులు మంజూరు చేయలేదని, వీటికి పోస్టులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా లెక్కించాలని, వాటిలో గ్రూప్-150 శాతం, గ్రూప్-2 లో 30 నుంచి 40 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలని ఆర్.క్రిష్ణయ్య అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్య తీసుకుందని చెప్పడాన్ని హర్షించదగ విషయమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చునది ఏమనగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా క్రింద భర్తీ చేయవలిసిన గ్రూప్-1. 2. 3. 4 సర్వీస్ ఉద్యోగాలను సరిగ్గా పూర్తి స్థాయిలో లెక్కించాలని, గణన చేసి భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంపలేదన్నారు. ఏదో నామమాత్రంగా లెక్కించి ప్రతిపాదనలు పంపారని… ఇప్పటికి అన్ని శాఖలలో అడ్ వాక్ ప్రమోషన్ల పేరు మీద భర్తీ చేశారన్నారు. టీచర్ పోస్టుల విషయంలో ప్రభుత్వ పాఠశాలల పోస్టులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాల పోస్టులు, ఆదర్శ పాఠశాల పోస్టులు కూడా వేరు వేరుగా జరపడంతో మెరిట్ అభ్యర్ధులు ఈ మూడు, నాలుగు రకాల యాజమాన్యాల పాఠశాలలో మెరిట్ ఉన్న ఒకే అభ్యర్థి సెలెక్ట్ అవుతాడన్నారు. ఒకే యాజమాన్యం పాఠశాలలో జాయిన్ అవుతారని, సెలెక్ట్ అయిన మిగతా మూడు వృధా అవుతాయన్నారు. అందుకే ఆప్షన్ పద్ధతి పెట్టడం, వెయిటింగ్ లిస్ట్ పెట్టడం, అన్ని పలితాలు ఒకేసారి ప్రకటించడం లాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. సుచిస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగం సమర్ధవంతంగా సాగాలంటి ఇన్చార్జిలతో పూర్తిస్థాయి అధికారులను నియమించాలని, కొత్త నోటిఫికేషన్లు వేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసి నాయకులు ఆస్మా, నవీన్ పట్నాయక్, జనార్థన్, రవి, బిసి సంక్షేమ సంఘం నాయకులు జె.అనంతయ్య, వేముల రామకృష్ణ, రాజేందర్, పళ్ళ సతీష్, మోదీ రాందేవ్, నిమ్మల వీరన్న, బాలయ్య, నంద గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
