ఎయిర్‌టెల్‌ రాజుకు డాక్టర్ చిక్కా దేవదాసు – 2025 ప్రతిభా పురస్కారం

హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ డివిజ‌న్‌కు చెందిన సామాజిక సేవా కార్యకర్త దోమల రాజు ( ఎయిర్‌టెల్ రాజు ) కు డాక్టర్ చిక్కా దేవదాసు రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం – 2025 అవార్డు లభించింది. ముషీరాబాద్ మహంకాళి దేవాలయం చైర్మన్‌గా ఉండి విశేష ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఇటీవల నగరంలోని త్యాగరాయగాన సభలో కళా నిలయం సంస్కృతిక సంస్థ ఓంకార సత్సంగం ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పోలీసు ఉన్నతాధికారి సుంకర సత్యనారాయణ, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు, పర్యావరణ వేత్త మిట్టపల్లి సురేష్ గుప్తా, మధురకవి చిక్కా శంకర్ చేతుల మీదుగా ఎయిర్‌టెల్ రాజు అవార్డు అందుకున్నారు. ఎయిర్‌టెల్ రాజు మాట్లాడుతూ… డాక్టర్ చిక్కా దేవదాసు – 2025 రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం తనపై మరింత సమాజ బాధ్యత పెరిగిందన్నారు. డాక్టర్ చిక్కా దేవదాసు జన్మదినోత్సవం సందర్భంగా లభించింద‌న్నారు. ఈ కార్యక్రమంలో సురేందర్, పుష్ప లత తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page