శ్మశానవాటికలో అపరకర్మల సముదాయాల షెడ్‌ల‌ ఏర్పాటు

శ్మశానవాటికలో అపరకర్మల సముదాయాల షెడ్‌ల‌ ఏర్పాటు

కాచిగూడ, జూలై 27, ( అద్దం న్యూస్ ) :  అంబ‌ర్‌పేట హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులు శ్మశానవాటిక ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అంబ‌ర్‌పేట హిందూ శ్మశానవాటిక ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు రాజేంద‌ర్ ప‌టేల్‌ గౌడ్ అన్నారు. నగరంలో ఎక్కడ లేని విధంగా అంబ‌ర్‌పేట శ్మశాన వాటికలో అపరకర్మల సముదాయాల షెడ్‌ల‌ను అధ్యక్షుడు రాజేంద‌ర్ ప‌టేల్‌ గౌడ్, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆదివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రాజేంద‌ర్ ప‌టేల్‌ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ…. కర్మ పూజలు, కర్మ భోజనాలు, తదితర పూజల కోసం ఈ షెడ్‌ల‌ను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్మశానవాటికకు వచ్చే ప్రజల ఫిర్యాదుల మేరకు గతంలో ఆపరకర్మల పెద్ద సత్రాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. ఇందులో దహన సంస్కారాలను నిర్వహించడానికి 2 వేల చదరపు గజాలతో నూతన హాల్‌ను నిర్మించినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు సహాకారం అందిస్తే శ్మశాన వాటికను మరింతగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్ విగ్‌, సాయి గిరిధర్, భీమాగౌని కృష్ణాగౌడ్, కన్నె రమేష్ యాద‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page