Saturday, September 19, 2026
No menu items!
HomeNational40 ఏళ్ల వయసులో తండ్రైన భారత మాజీ క్రికెటర్!

40 ఏళ్ల వయసులో తండ్రైన భారత మాజీ క్రికెటర్!

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తండ్రయ్యాడు. అతని సతీమణి విద్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాయుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తన భార్య, బిడ్డతో ఉన్న ఫొటోను రాయుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘మాకు కొడుకు పుట్టాడు.. సంతోషంగా ఉంది.’అని రాయుడు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

అంబటి రాయుడు, విద్యకు 2009లో వివాహం జరగ్గా.. 2020 జూలైలో ఈ దంపతులకు మొదటి సంతానంగా ఆడ బిడ్డ జన్మించింది. ఆ పాపకు వివియా అని పేరు పెట్టారు. అనంతరం 2023లో రెండోసారి తండ్రి కాగా.. మరోసారి కూతురే పుట్టింది. తాజాగా 40 ఏళ్ల వయసులో అంబటి రాయుడు మూడో సారి తండ్రి కాగా.. ఈసారి మగ బిడ్డ పుట్టాడు. సోషల్ మీడియా, మీడియాకు చాలా దూరంగా ఉండే రాయుడు.. వ్యక్తిగత గోప్యత పాటిస్తాడు. అతని కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించడానికి ఇష్టపడ్డాడు. మూడోసారి తండ్రైన అంబటి రాయుడుకు సహచర క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు, అభిమానులు, సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ విజయానంతరం అన్ని రకాల ఫార్మాట్లకు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అతను.. వైఎస్సార్‌సీపీ పార్టీ‌లో చేరి అంతే వేగంగా బయటకు వచ్చాడు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డాడు. ఆ తర్వాత జనసేనలో చేరినా.. క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తరపున ఆడిన రాయుడు.. మొత్తం 6 సార్లు టైటిల్ అందుకున్నాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page